Exclusive: ఒవైసీనే స్పీక‌ర్‌గా కొన‌సాగిస్తే రాజా సింగ్ రాజీనామా చేస్తారా?

Exclusive: AIMIM నేత అక్బ‌రుద్దిన ఒవైసీని (akbaruddin owaisi) తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీక‌ర్‌గా నియ‌మించినందుకే BJP ఎమ్మెల్యే రాజా సింగ్ (raja singh) అసెంబ్లీకి రాన‌ని ప్ర‌మాణ స్వీకారం చేయ‌న‌ని మొండికేస్తున్నారు. తాను బ‌తికున్నంత వ‌ర‌కు ఒవైసీ ఉండ‌గా ప్ర‌మాణ స్వీకారం చేయ‌న‌ని శ‌ప‌థం చేసారు.

అయితే ఒక‌వేళ అక్బ‌రుద్దిన ఒవైసీనే ఫుల్ టైం స్పీక‌ర్‌గా నియ‌మిస్తే రాజా సింగ్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తారా? ఆ ఆలోచ‌న‌లో కూడా రాజా సింగ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు ప‌ద‌వి కంటే త‌న మ‌తం ముఖ్య‌మ‌ని అంటున్న రాజా సింగ్ రాజాక‌ర్ లాంటి ఒవైసీ ఎదుట నిల‌బ‌డి అధ్య‌క్షా అధ్య‌క్షా అంటూ త‌న వాద‌న‌లు వినిపించ‌లేని రాజా సింగ్ చెప్తున్నారు. ఒవైసీ ప్రొటెం స్పీక‌ర్‌గా ఉన్నందుకే రాజా సింగ్ ప్ర‌మాణ స్వీకారానికి రాక‌పోవ‌డం ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) ఏమంటారో వేచి చూడాలి.