Amitabh Bachchan: కోడలిని అన్‌ఫాలో చేసిన బిగ్‌బి.. ఐష్, అభి విడిపోతున్నారా?
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ తన కొడలైన ఐశ్వర్య రాయ్‌ను (aishwarya rai) ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యారు. కొంతకాలంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ (abhishek bachchan) మధ్య సఖ్యత లేదని వారు విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ ఐశ్వర్యను అన్‌ఫాలో చేయడం మరింత సందేహానికి తావిస్తోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న తన రూ.50 కోట్ల ఇంటిని కూతురు శ్వేతా బచ్చన్ పేరిట రాసారు. ఈ విషయంలో కూడా కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇటీవల అమితాబ్ మనవడు అయిన అగస్త్య నంద నటించిన ఆర్చీస్ అనే సినిమా స్పెషల్ షో కోసమని ఐష్, అభిషేక్ కలిసే వెళ్లారు. ఈ ఈవెంట్ జరిగిన మరుసటి రోజే అమితాబ్ ఐశ్వర్యని అన్‌ఫాలో చేసారు. దాంతో బచ్చన్ కుటుంబంలో చీలిక ఏర్పడబోతోందన్న టాక్ మొదలైపోయింది.