సమస్యలు తొలగాలంటే ఈ ఆలయాలకు వెళ్లాల్సిందే..!
Spiritual: రామ భక్త హనుమంతుడిని పూజిస్తే ఎనలేని ధైర్యం వస్తుంది. అంతేకాదు భారతదేశంలో ఉన్న ఈ టాప్ 3 హనుమంతుడి ఆలయాలను సందర్శిస్తే జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. అవి ఏ ఆలయాలో తెలుసుకుందాం.
మహెందీపూర్ బాలాజీ ఆలయం
రాజస్థాన్లోని డౌసా జిల్లాలో ఉన్న మెహెందీపూర్ బాలాజీ ఆలయంలో ఆంజనేయ స్వామి బాలాజీ రూపంలో దర్శనమిస్తారు. ఎవరిపైన అయినా చేతబడి చేసినట్లు అనిపిస్తే వారిని ఈ ఆలయానికి తీసుకొస్తుంటారు. రోజూ ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇదే ఆలయంలో భైరవుడు, ప్రేతరాజు విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ హనుమంతుడి విగ్రహం స్వయంబుగా వెలిసిందని చెప్తుంటారు.
సలసార్ బాలాజీ
ఈ ఆలయం కూడా రాజస్థాన్లోని చూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా హనుమంతుడు బాలాజీ రూపంలో దర్శనమిస్తారు. 1754లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకున్నా కోరిన కోర్కెలు నెరవేరతాయని చెప్తుంటారు.
మహవీర్ హనుమాన్ మందిర్
బిహార్ రాజధాని పట్నాలో ఉంది ఈ ఆలయం. 18వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. ప్రతి మంగళవారం, శనివారాల్లో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. కోరిన కోరికలు అన్నీ నెరవేర్చే దైవంగా ఆయన్ను కొలుస్తుంటారు.