కోరిక‌లు చంపుకోండి అని చెప్పిన న్యాయ‌మూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

Supreme Court: ఇటీవ‌ల క‌ల‌క‌త్తా హైకోర్టు (calcutta high court) ఓ కేసులో ఉచిత స‌ల‌హా ఇచ్చిన‌ట్లు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం మండిప‌డుతోంది. మ్యాట‌ర్ ఏంటంటే.. ఇటీవ‌ల ఒక బాలిక త‌న ప్రియుడు రేప్ చేసాడ‌ని కోర్టుకెక్కింది. ఈ కేసులో తీర్పు వెల్ల‌డిస్తూ.. అమ్మాయిలు త‌మ కోరిక‌ల‌ను అదుపులో పెట్టుకోవాల‌ని.. లేక‌పోతే ఇలాంటి స‌మ‌స్య‌లే వ‌స్తాయ‌ని తెలిపింది. పైగా ఆ అబ్బాయి మైన‌ర్ కావ‌డంతో స‌రైన శిక్ష కూడా వేయ‌లేదు.

ఈ కేసు విష‌యంలో జ‌డ్జ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సుప్రీంకోర్టు మండిప‌డింది. న్యాయ‌మూర్తుల ప‌ని తీర్పు చెప్పడం వ‌ర‌కే అని అది మానేసి ఉచిత స‌ల‌హాలు బోధ‌న‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. కేసులో త‌ప్పు ఎవ‌రిది ఎలాంటి శిక్ష ప‌డుతుంది అని చెప్ప‌వ‌ర‌కే కోర్టుల ప‌ని అని అంత‌కుమించి ఎక్కువ మాట్లాడే హ‌క్కు లేద‌ని మండిప‌డింది.