Free Bus Travel: ఉచితంగా ప్ర‌యాణించాలంటే ఇవి ఉండాల్సిందే

Free Bus Travel: రేప‌టి నుంచి తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు TSRTC బస్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ఉంటుంది. అయితే ఈ స‌ర్వీసుల‌ను వాడుకోవ‌లంటే బ‌స్సు ఎక్కే స‌మ‌యంలో క‌చ్చితంగా ఆధార్ కార్డు పెట్టుకోవాలి. బ‌స్సు ఎక్కే స‌మ‌యంలో కండ‌క్ట‌ర్‌కు ఆధార్ కార్డు చూపించాకే బ‌స్సులోకి అనుమ‌తిస్తారు. తెలంగాణ వాసులు కాని వారికి మాత్రం ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌దు.