85వేల కోట్ల మోసం నిజ‌మా.. CM vs CMD..!

BRS ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు విద్యుత్ విష‌యంలో రూ.85,000 కోట్ల మేర మోసం జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) . ఈ లెక్క‌లు తేలేవ‌ర‌కు CMD ప్ర‌భాక‌ర్ రావు (prabhakar rao) రాజీనామాను స్వీక‌రించొద్ద‌ని ఆదేశాలు జారీ చేసారు. ఈరోజు రివ్యూ మీటింగ్‌కి రావాల్సిందిగా ప్ర‌భాక‌ర్ రావుకు ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా ఆయ‌న మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. దాంతో మోసం జ‌రిగింది కాబ‌ట్టే ఆయ‌న మీటింగ్‌కు రాలేద‌ని.. ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా KCR, KTRల‌ను క‌లిసి ఏం చేయాలో ఆలోచిస్తుంటార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కుట్ర జ‌రిగిందని.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సోమ‌వారం వ‌ర‌కు స‌రిప‌డా క‌రెంట్ మాత్రమే మిగిలి ఉంద‌ని ఆ త‌ర్వాత యావ‌త్ రాష్ట్రం అంధ‌కారంలోకి వెళ్ల‌నుంద‌ని రేవంత్ అంటున్నారు. ఇలా చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాకే విద్యుత్ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌నే ప్ర‌చారం చేయాల‌న్న కుట్ర చేసే ప‌నిలో BRS ఉంద‌ని అంటున్నారు. నిన్న జ‌రిగిన తొలి కేబినెట్ మీటింగ్‌లో కూడా రేవంత్ రెడ్డి విద్యుత్ అధికారుల‌పై మండిపడ్డారు. ఇప్పుడు ప్ర‌భాకర్ రావు రివ్యూ మీటింగ్‌కి రాక‌పోతే అధికారికంగా కేసు వేసి స‌మ‌న్లు జారీ చేస్తారు.