Meftal: ఈ ట్యాబ్లెట్ తెగ వాడేస్తున్నారా.. అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Meftal: మెఫ్ట‌ల్ స్పాస్ పెయిన్ కిల్ల‌ర్ వాడే పేషెంట్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ట్యాబ్లెట్ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. దీనిని వాడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఇండియ‌న్ ఫార్మాకోపియా క‌మిష‌న్ (IPC) హెచ్చ‌రిస్తోంది. ఇందులో ఉండే మెఫెన‌మిక్ యాసిడ్ అనే అంశం కొన్ని ర‌కాల అనారోగ్య సమ‌స్య‌ల‌కు కార‌ణం అవుతోంద‌ట‌. సాధార‌ణంగా ఈ ట్యాబ్లెట్‌ని పీరియ‌డ్ పెయిన్స్, కీళ్ల‌వాతం, ఇత‌ర నొప్పుల‌కు పెయిన్ కిల్ల‌ర్‌గా వాడుతుంటారు. దీనిని తీసుకుంటున్న‌వారిలో డ్రెస్ సిండ్రోమ్ (dress syndrome) అనే స‌మ‌స్య ఏర్ప‌డుతోందట‌. డ్రెస్ సిండ్రోమ్ వ‌ల్ల విప‌రీత‌మైన అలెర్జీ, జ్వ‌రం వ‌స్తుంటాయి. మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోవ‌డం వ‌ల్ల పైన చెప్పిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే www.ipc.gov.in లో రిపోర్ట్ చేయాల‌ని చెప్తున్నారు.