Pushpa 2: కేశ‌వ అరెస్ట్… షూటింగ్ ఆగుతుందా.. క్యారెక్ట‌ర్ మారుతుందా?

Pushpa 2: పుష్ప సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు న‌టుడు జ‌గ‌దీష్ బండారి (jagadish bandari). కానీ ఆయ‌న్ను పంజాగుట్ట పోలీసులు నిన్న అరెస్ట్ చేసారు. ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యాడు అన్న ఆరోప‌ణ‌ల‌తో జ‌గ‌దీష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దాంతో పుష్ప 2 షూటింగ్ ఆగిపోతుందా? లేక ఏకంగా జ‌గ‌దీష్ పాత్ర‌నే మార్చేస్తారా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ప్ర‌స్తుతానికైతే జ‌గ‌దీష్ బెయిల్‌పై రిలీజ్ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అత‌ను బ‌యటికి రాగానే ముందు కేశ‌వ పాత్ర‌కు సంబంధించిన అన్ని స‌న్నివేశాల‌ను త్వ‌ర‌గా షూట్ చేసేయాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ అనుకుంటున్నార‌ట‌. మ‌రోప‌క్క జ‌గ‌దీష్ వ‌ల్ల సినిమాపై ఎక్కడ ప్ర‌భావం చూపుతుందోన‌న్న భ‌యం కూడా చిత్ర‌బృందానికి ఉంది.

పుష్ప సినిమాలో కేశ‌వ పాత్ర‌లో న‌టించిన జ‌గ‌దీష్ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. స‌హ‌జ‌మైన యాక్టింగ్‌తో అల్లు అర్జున్‌ని డామినేట్ చేసేలా న‌టించారు. కానీ ఆయ‌న చేసిన ఈ ఒక్క త‌ప్పు వ‌ల్ల మొత్తం సినిమాపైనే తీవ్ర ప్ర‌భావం చూపేలా ఉంది.