Seethakka: గ‌వ‌ర్న‌రే షాక‌య్యేలా..!

Seethakka: సీత‌క్క అలియాస్ ద‌న‌స‌రి అన‌సూయ (danasari anasuya)  ములుగులో హ్యాట్రిక్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. సీత‌క్క అంటే ములుగు ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని అభిమానం. ఆ అభిమానంతోనే ఆమెకు మ‌రోసారి అధికారాన్ని అప్ప‌గించారు. అంతేకాదు.. ఎంద‌రో అభిమానాల‌ను చూర‌గొన్న సీత‌క్క‌కు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ల‌భించింది.

అయితే.. సీత‌క్క ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. సీత‌క్క స్టేజ్‌పై ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి రాగానే ప్ర‌జ‌లు స్టేడియం ద‌ద్ద‌రిల్లేలా అరిచారు. ఆ అరుపుల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కూడా షాక్ అయ్యారు. వారు అరుస్తూనే ఉంటారు.. మీరు మొద‌లుపెట్టండి అన్న‌ట్లు సీత‌క్క‌కు త‌మిళిసై సైగ‌లు చేయ‌డంతో ఆమె ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఒక మ‌హిళా గిరిజ‌న బిడ్డ‌కు ఇంత‌కంటే ఏం కావాలి చెప్పండి..!