Bhupinder Singh: కంచె గొడవ.. హత్య చేసిన తమ్ముడు సినిమా విలన్
పవన్ కళ్యాణ్ (pawan kalyan) నటించిన తమ్ముడు (thammudu) సినిమాలో విలన్‌గా నటించిన భుపిందర్ సింగ్ (bhupinder singh) నిజ జీవితంలోనూ విలన్ అయ్యాడు. ఓ మొక్క విషయంలో కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్మోర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయనకు బిజ్మోర్లో పొలాలు ఉన్నాయి. ఆయన తన పొలానికి కంచె వేసుకుంటున్న సమయంలో పక్కనే గుర్దీప్ సింగ్ అనే వ్యక్తికి చెందిన పొలంలోని యూకలిప్టస్ చెట్లు విరిగి పడ్డాయి. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో భుపిందర్ సింగ్ తుపాకీ తీసి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో గుర్దీప్ సింగ్ కుమారుడు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.