Renu Desai: మీది వీక్ హార్ట్ అయితే చూడ‌కండి.. యానిమ‌ల్ సినిమాపై రేణూ రివ్యూ

Renu Desai: న‌టి రేణూ దేశాయ్ నిన్న యానిమ‌ల్ (animal) సినిమా చూసార‌ట‌. ర‌ష్మిక మంద‌న, ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించిన ఈ సినిమా త‌న‌కు పిచ్చిగా నచ్చింద‌ని తెలిపారు. వీక్ హార్ట్ ఉన్న‌వారు ఈ సినిమా చూడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఎందుకంటే ఇందులో ర‌క్త‌పాత సన్నివేశాలు చాలా ఉన్నాయ‌ని అన్నారు. ఏదైనా ఒక విభిన్న‌మైన సినిమాను చూడాల‌నుకునే వారికి మాత్రం త‌ప్ప‌కుండా యానిమ‌ల్ సినిమా నచ్చుతుంద‌ని త‌న పేర్కొన్నారు రేణు.