Aditi Govitrikar: క్యాస్టింగ్ కౌచ్ గురించి బ‌య‌ట‌పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్

Aditi Govitrikar: బాలీవుడ్‌లో ఓ పెద్ద సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు ఓ నిర్మాత త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడంటూ క్యాస్టింగ్ కౌచ్ అనుభ‌వాన్ని పంచుకున్నారు న‌టి అదితి గోవిత్రిక‌ర్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) న‌టించిన బ్లాక్ బ‌స్టర్ సినిమా త‌మ్ముడులో (thammudu) అదితి సెకండ్ హీరోయిన్ పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా వ‌ల్ల ఆమెకు మంచి పేరు వ‌చ్చింది కానీ తెలుగులో అవ‌కాశాలు రాలేదు. దాంతో అదితి మ‌ళ్లీ బాలీవుడ్ వెళ్లిపోయారు.

షూటింగ్ కోస‌మ‌ని సౌత్ ఆఫ్రికాకి వెళ్లినప్పుడు నిర్మాత ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని.. నీకేమైనా పిచ్చా అని తిట్టాన‌ని తెలిపారు. దాంతో అత‌ని ఈగో హ‌ర్ట్ అయ్యి మొత్తం టీంని షూటింగ్ పూర్తి కాకుండానే ముంబై పంపించేసార‌ని అదితి తెలిపారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ త‌న‌ను పిలిచి ఏవేవో సాకులు చెప్పార‌ని కానీ ఆ నిర్మాత‌కు కావాల్సింది తాను ఇవ్వ‌లేద‌నే కోపంతోనే త‌న‌ను సినిమా నుంచి తొల‌గించేసార‌ని త‌ర్వాత అర్థ‌మైంద‌ని అదితి తెలిపారు.