India: భార‌త్‌లో సుర‌క్షిత‌మైన న‌గ‌రం ఇదే..!

India: భార‌త‌దేశంలోని అత్యంత సుర‌క్షిత న‌గ‌రాల్లో వ‌రుస‌గా మూడోసారి మ‌ళ్లీ ఈ న‌గ‌ర‌మే ఎంపికైంది. ఇంత‌కీ ఏంటా న‌గ‌రం అనుకుంటున్నారా? వెస్ట్ బెంగాల్ రాజ‌ధాని క‌ల‌క‌త్తా. ప్ర‌తీ ల‌క్ష జ‌నాభాలో చాలా త‌క్కువ నేరాలే జ‌రిగాయ‌ని ఇత‌ర న‌గ‌రాలతో పోల్చుకుంటే క‌ల‌క‌త్తాలోనే అత్యంత త‌క్కువ నేరాలు జ‌రుగుతున్నాయ‌ని నేష‌న‌ల్ క్రైం రికార్డుల బ్యూరో (NCRB) వెల్ల‌డించింది.

2022లో క‌ల‌క‌త్తాలో 86.5 కాగ్నైజ‌బుల్ నేరాలు మాత్ర‌మే జ‌రిగాయి. ఆ త‌ర్వాత స్థానంలో పుణె ఉంది. 2022లో పుణెలో 280.7 కేసులు న‌మోద‌య్యాయి. మూడో స్థానంలో హైద‌రాబాద్ (299.2) ఉంది. కాగ్నైజ‌బుల్ నేరం అంటే స‌మాచారం అంద‌గానే పోలీసులు వెంట‌నే ద‌ర్యాప్తు చేప‌డ‌తారు. నిందితుల‌ను అనుమానితుల‌ను అరెస్ట్ చేయ‌డానికి ఎలాంటి అరెస్ట్ వారెంట్ అవ‌సరం లేని దానిని కాగ్నైజ‌బుల్ నేరం అంటారు. 20

ల‌క్ష‌ల మంది జ‌నాభా ఉన్న న‌గ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఓ అంచ‌నాకు వ‌స్తారు. ప్ర‌స్తుతానికి 19 న‌గ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోగా సురక్షిత‌మైన న‌గ‌రంగా క‌ల‌క‌త్తా నిలిచింది. గ‌త రెండేళ్లుగా క‌ల‌క‌త్తానే టాప్‌లో ఉంది. అయితే మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల విష‌యంలో మాత్రం క‌ల‌క‌త్తా కాస్త వెన‌కే ఉంద‌ని చెప్పాలి. 2021తో పోలిస్తే 2022లో మ‌హిళ‌ల‌పై నేరాలు ఎక్కువ‌య్యాయి.