భారత్‌పై ఫేక్ న్యూస్.. చైనా ఖాతాలపై కొరడా ఝలిపించిన ఫేస్బుక్
Facebook: చైనాకు (china) చెందిన కొన్ని ఫేక్ ఖాతాలు భారత్‌పై (india) ఫేక్ వార్తలను సృష్టిస్తున్నాయని తెలిసి వాటిపై ఫేస్బుక్ సంస్థ కొరడా ఝళిపించింది. ఆ ఖాతాలన్నింటిపై కన్నేసి ఒక్కొక్కటిగా డిలీట్ చేసేసింది. చైనాకు చెందిన కొందరు వ్యక్తులు భారతీయ పేర్లతో ఫేక్ ఖాతాలు సృష్టించి భారత్ రాజకీయాలు, భద్రతా అంశాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్లు మెటా సంస్థ దృష్టికి వచ్చింది.
ఈ ఖాతాల్లో చాలా మంది తమని తాము భారత్‌కు చెందిన జర్నలిస్ట్‌లు, న్యాయవాదులు, మానవ హక్కుల యాక్టివిస్ట్లుగా చెప్పుకుంటున్నారట. ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని, హిందీ, చైనీస్ భాషల్లో తక్కువ కంటెంట్ పోస్ట్ చేసినట్లు నివేదికలో వెల్లడైందని మెటా తెలిపింది. చైనాకు చెందిన దాదాపు 4,700 ఫేక్ ఖాతాలు అమెరికా రాజకీయ అంశాలపై తప్పుడు పోస్ట్‌లు పెడుతున్నట్లు తెలిసిందని వాటిని కూడా డిలీట్ చేసేసామని తెలిపింది.