Marriage: ఇక్క‌డ తండ్రులే కూతుళ్ల‌ని వివాహం చేసుకుంటారు..!

Marriage: సాధార‌ణంగా తల్లిదండ్రులు త‌మ కూతుళ్ల‌ను ఓ అయ్య చేతిలో పెట్టాల‌నుకుంటారు. త‌మ బిడ్డ అత్త‌గారింట్లో సంతోష‌కంగా ఉండాల‌ని కోరుకుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం తండ్రులే కూతుళ్ల‌ను వివాహం చేసుకుంటారు. ఇది మ‌న‌కు నీచంగా అనిపించినా.. ఈ దేశ‌స్థుల‌కు మాత్రం ఇదో ఆచారం. ఇంత‌కీ ఈ దిక్కుమాలిన ఆచారం ఎక్క‌డుందంటే.. బంగ్లాదేశ్.

బంగ్లాదేశ్‌లోని మండి అనే వ‌ర్గంలో ఇలా వివాహాలు జరుగుతుంటాయి. ఈ మండి వ‌ర్గానికి చెందిన‌వారు ఇప్ప‌టికీ పాత కాలం నాటి సంప్ర‌దాయాలు పాటిస్తున్నారు. కూతుళ్ల‌కు 18 ఏళ్లు నిండ‌గానే తండ్రే పెళ్లి చేసుకుంటాడు. ఒక‌వేళ ఆ తండ్రి చ‌నిపోతే కూతురు విధ‌వ అవుతుంది కాబ‌ట్టి అప్పుడు బ‌య‌టి వ్య‌క్తి వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడ‌ట‌. అయితే ఇక్క‌డ అస‌లైన ట్విస్ట్ ఏంటంటే.. క‌న్న‌తండ్రి క‌న్న కూతురిని పెళ్లి చేసుకోడు. స‌వ‌తి తండ్రి స‌వ‌తి కూతురిని చేసుకోవాల‌ట‌. టెక్నాల‌జీ దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారంటే వీరిని ఏమ‌నాలో అర్థంకావ‌డంలేదు.