పోయి చావ‌రా.. న‌డి రోడ్డుపై మాజీ ప్ర‌ధాని కోడలి ర‌చ్చ‌..!

HD Devegowda: మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కోడ‌లు భ‌వానీ రేవ‌న్న (bhavani revanna) న‌డిరోడ్డుపై నానా హంగామా చేసారు. శుక్ర‌వారం భ‌వానీ బెంగ‌ళూరు నుంచి సాలిగ్రామకు కారులో వెళ్తున్నారు. ఆమె ప్ర‌యాణిస్తున్న కారు ఖ‌రీదు రూ.1.5 కోట్లు. అయితే.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్య‌క్తి అదుపు త‌ప్పి భ‌వానీ కారును ఢీకొన్నాడు. దాంతో ఆమె కారు నుంచి బ‌య‌టికి వ‌చ్చి క‌నీసం ఆ బైక్‌పై వెళ్తున్న వ్య‌క్తికి ఏమ‌న్నా గాయాల‌య్యాయా అని కూడా చూడ‌కుండా రాయ‌లేని ప‌దాల‌తో అత‌న్ని ధూషించింది. ఎక్క‌డికైనా పోయి చావు అంటూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటే స్థానికులు వీడియో తీసారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై JD(S) నేత‌లు స్పందించ‌లేదు.