Telangana Results: నాడు జ‌గ‌న్.. నేడు రేవంత్..!

Telangana Results: నాడు ఏపీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డిలాగే (jagan mohan reddy) ఈరోజు రేవంత్ రెడ్డి (revanth reddy) ప‌రిస్థితి ఉంది. చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఏపీ సీఎంగా ఉన్న‌ప్పుడు అక్రమ ఆస్తుల కేసులో జ‌గ‌న్‌ను జైలుకు పంపించారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్‌ హైద‌రాబాద్‌లోని చంచ‌ల్‌గూడ జైలులో శిక్ష అనుభ‌వించారు.

సేమ్ ఇదే ప‌రిస్థితి రేవంత్ రెడ్డికి ఎదురైంది. KCR సీఎంగా ఉన్న‌ప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను జైలుకు పంపించారు. రేవంత్ కూడా ఇదే చంచ‌ల్‌గూడ జైలులో శిక్ష అనుభ‌వించారు. ఆ నాడు జ‌గ‌న్ బ‌య‌టికి వ‌చ్చి పాద‌యాత్ర చేసి ఏపీకి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ‌కు అదే విధంగా సీఎం అవుతార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి.