Telangana Election Results: తెలంగాణ “కింగ్ కాంగ్”రెస్
Telangana Election Results: BRS పార్టీ హ్యాట్రిక్ మిస్ అయింది. తెలంగాణ రాజ్యం కాంగ్రెస్ (congress) వశమైంది. ముందు నుంచి BRS పార్టీ కాస్త ఓవర్ కాన్ఫిడెంట్‌గానే ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మంత్రి KTR ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువకులతో ముచ్చట్లు.. గంగవ్వతో వంటలు.. ఇలా ఓట్ల కోసం చాలానే చేసారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఆల్రెడీ రెండుసార్లు BRS పార్టీకే పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నట్లున్నారు. అందుకే కాంగ్రెస్ చేతికి అధికారాన్ని ఇచ్చారు.
ఈసారి కూడా ఈజీగానే గెలుస్తాం. గెలవడం గ్యారెంటీ కానీ 90 సీట్ల వరకు గెలుస్తామా లేదా అన్నది చూడాలని KTR చాలా సార్లు అన్నారు. ఓ రకంగా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బకొట్టింది. TSPSC పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం.. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం BRS పార్టీకి తీవ్ర వ్యతిరేకత చూపించింది. అందులోనూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి మెయిన్ టాపిక్స్‌పై ఫోకస్ చేసి ప్రజలను తమవైపునకు తిప్పుకున్నారు. ఇలా ప్రతీ విషయం కాంగ్రెస్‌కే కలిసొచ్చేలా చేసింది.