Telangana Elections: ఎన్నిక‌ల ఫ‌లితాలు.. ఏపీలో గుబులు..!

Telangana Elections: రేపు తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చేదెవ‌రో తెలిసిపోతుంది. ఓట్ల కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు స‌ర్వం సిద్ధంగా ఉంది. ఇక్క‌డ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో గుబులు ప‌ట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ (exit polls) ఫ‌లితాల‌ను చూడ‌గానే ఓట‌మి ఖాయం అని KCRకు అర్థ‌మైపోయింద‌ని.. అందుకే ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (jagan mohan reddy) ఫోన్ చేసార‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం.

2024లో మార్చిలో ఏపీలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో (ap elections) సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌కు పెట్టాల్సిందేన‌ని KCR స‌ల‌హా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక నాలుగు ఎంపీ సీట్ల‌కు త‌ప్ప మిగలిన చోట్ల ఉన్న అభ్య‌ర్ధుల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత బ‌లంగా ఉంద‌ని.. వారిని మారిస్తేనే గెలిచే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే మళ్లీ టికెట్లు ఇస్తాన‌ని జ‌గ‌న్ అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో జరుగుతున్న మార్పులు చూసి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్లు టాక్‌. క‌డ‌ప‌, రాజంపేట, బాప‌ట్ల‌, మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థానాల్లో త‌ప్ప మిగ‌తా అన్నింట్లో అభ్య‌ర్ధుల‌ను మార్చే ప్ర‌క్రియ‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంది.