Aditya L1: గుడ్ న్యూస్…. సూర్యుడిపై స్టడీ మొదలుపెట్టేసిన ఆదిత్య ఎల్ 1
Aditya L1: ఇస్రో (isro) ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేసిన ఆదిత్య ఎల్ 1 ఈరోజు చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. సూర్యుడికి సంబంధించిన సౌర గాలులపై రీసెర్చ్ ప్రారంభించేసినట్లు ఇస్రో వెల్లడించింది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ (ASPEX) పేలోడ్‌లో అమర్చిన SWIS, STEPS అనే రెండు కీలక పరికరాలు తమ పనిని మొదలుపెట్టేసాయి. అవి అనుకున్నట్లే పని చేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. ఈ ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను ఇస్రో సెప్టెంబర్ 2న ప్రయోగించింది. సౌర గాలులపై రీసెర్చ్ చేసేందుకు దాని నుంచి వచ్చిన డేటాతో మరిన్ని మిషన్లను లాంచ్ చేసేందుకు ఇస్రో ఆదిత్య ఎల్ 1ను లాంచ్ చేసింది.
Also Read: Aditya L1: L1 అంటే ఏంటి.. ఇస్రో ఎలా ప్లాన్ చేసింది?