Kerala: నేను జ‌డ్జ్ కాబోతున్నాను.. రేప్ కేసు వెన‌క్కి తీసుకోండి ప్లీజ్

Kerala: సాయం కోరి వ‌చ్చిన ఆడ‌పిల్ల‌ని దారుణంగా రేప్ చేసి ఇప్పుడు ఆ పిల్ల కేసు వేస్తే.. నేను జ‌డ్జ్ కాబోతున్నాను ద‌య‌చేసి కేసు వాప‌సు తీసుకోండి అని వేడుకోవ‌డం మొద‌లుపెట్టాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది. ఎర్నాకుళంకి చెందిన మ‌ను అనే వ్య‌క్తి కేర‌ళ హైకోర్టులో సీనియ‌ర్ లాయ‌ర్‌గా పనిచేస్తున్నాడు. ఇత‌ను త్వ‌ర‌లో జ‌డ్జ్ బాధ్య‌త‌లు తీసుకోబోతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ యువ‌తి ఓ కేసు విష‌యంలో మ‌నును క‌లిసేందుకు అత‌ని ఇంటికి వెళ్లింది.

ఇదే అద‌నుగా చూసి మ‌ను ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. పైగా ఎవ‌రికైనా చెప్తే చంపేస్తాన‌ని బెదిరించాడు. ఇలా మ‌రో రెండు సార్లు రేప్ చేసాడు. దాంతో మ‌ను త‌న సోద‌రుడికి చెప్పి కేసు వేసింది. కేసు వేసిన విష‌యం తెలిసి మ‌ను బాధితురాలి అన్న‌కు ఫోన్ చేసాడు. కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని ఎంత డ‌బ్బు కావాలన్నా ఇస్తాన‌ని చెప్పాడు. త్వ‌ర‌లో తాను జడ్జ్ బాధ్య‌త‌లు తీసుకోబోతున్నాన‌ని త‌న కెరీర్‌ను నాశ‌నం చేయొద్ద‌ని ఏడ్చాడు. అయినా అత‌ను విన‌లేదు. స్థానిక మీడియా సాయంతో మ‌ను చేసిన ఫోన్ కాల్ ఆడియోను వినిపించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.