US: భార‌త్‌పై బైడెన్‌కు న‌మ్మ‌కం పోయిందా.. గూఢ‌చారిని ఎందుకు పంపించాడు

US: అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ (joe biden) చేస్తున్న కొన్ని ప‌నులు చూస్తుంటే భార‌త్‌పై (india) ఆయ‌న‌కు ఉన్న న‌మ్మ‌కం పోయిందా అన్న సందేహం క‌లుగుతోంది. ఇటీవ‌ల అమెరికా ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఇండియాకు చెందిన ఓ వ్య‌క్తి ఖ‌లిస్తానీ వేర్పాటువాది గుర్ప‌త్వంత్ సింగ్ ప‌న్నున్‌ను (gurpatwant singh pannun) హ‌త్య చేసేందుకు కుట్ర ప‌న్నితే దానిని భ‌గ్నం చేసామ‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై భార‌త్ స్పందిస్తూ ఇది షాకింగ్, స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంద‌ని తెలిపింది.

ఆల్రెడీ కెనడా అధ్య‌క్షుడు జ‌స్టిన్ ట్రూడో (justin trudeau) ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ (hardeep singh nijjar) హ‌త్య ఘ‌ట‌న‌లో భార‌త్ ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించారు. ఆ ఆరోప‌ణ‌ల్లో ఆధారాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ భార‌త్ నింద‌లు ప‌డాల్సి వ‌చ్చింది. ఎప్పుడూ భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలిచే అమెరికా కూడా ఈ మ‌ధ్య ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డంతో అగ్ర‌రాజ్యానికి భార‌త్‌పై న‌మ్మ‌కం పోతున్న‌ట్లు ఉందా? అనే ప్ర‌శ్న ఎదురువుతోంది.

ఎందుకంటే.. భార‌త్‌కు చెందిన వ్య‌క్తి ప‌న్నున్‌ను చంపేందుకు కుట్ర పన్నాడ‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా జో బెడెన్‌కు ఎప్పుడైతే తెలిసిందో ఆ స‌మ‌యంలో బైడెన్ ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా భార‌త్‌లో అమెరికాకు చెందిన గూఢ‌చారిని దింపాడు. ఆ గూఢ‌చారి సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) డైరెక్ట‌ర్ విలియం బ‌ర్న్స్. ఆయ‌న ఇటీవ‌ల రాజ‌ధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. దాంతో ఈ విష‌యాన్ని భారత్ సీరియ‌స్‌గా తీసుకుని ప‌న్నున్‌ను ఇండియాకు చెందిన నిఖిల్ గుప్తా అనే వ్య‌క్తి ఎందుకు చంపాల‌నుకున్నాడు అనే దానిపై క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు అమెరికాకు తెలిపింది.