Spiritual: పక్షవాత నివారిణి.. బీజాసన్ అమ్మవారు..!
Spiritual: రాజస్థాన్లోని బీజాసన్ మాతా మందిరం (bijasan mata mandir) గురించి ఈరోజు తెలుసుకుందాం. దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయం బుండి జిల్లాలోని ఇందర్గడ్లో ఉంది. రక్తబీజ్ అనే రాక్షసుడిపై అమ్మవారు కూర్చుని దర్శనమిస్తారు కాబట్టి ఈ ఆలయానికి బీజాసన్ అనే పేరు వచ్చింది.
ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. పక్షవాతం ఉన్నవారు ఈ బీజాసన్ అమ్మవారిని దర్శించుకుంటే కొన్ని నెలల వ్యవధిలోనే మనిషి కోలుకుంటున్నాడట. పక్షవాతం వచ్చిన రోగులను ఈ ఆలయానికి తీసుకొచ్చినప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలోనే వారిలో ఏదో తెలీని మార్పు కనిపిస్తోందని అక్కడి భక్తులు చెప్తుంటారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 700 నుంచి 800 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్లే అవకాశం కల్పించారు.