KTR: ఓటెయ్యరు.. మమ్మల్నే నిలదీస్తారు.. అర్బన్ ఓటర్లపై మండిపాటు
KTR: ఈరోజు జరిగిన పోలింగ్‌లో చాలా మంది అర్బన్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంపై మండిపడ్డారు మంత్రి KTR. హైదరాబాద్ వాసులనే కాదు ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ముంబై, ఢిల్లీ వంటి అర్బన్ నగరాలకు చెందినవారు కూడా ఓట్లు వేసేందుకు ముందుకు రారని.. మళ్లీ వాళ్లే ప్రభుత్వం ఏమీ చేయడంలేదని నిలదీస్తారని అసహనం వ్యక్తం చేసారు.
ఇంకా పోలింగ్ సంపూర్ణంగా పూర్తి కాకుండా ఎలా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంకా ప్రజలు లైన్‌లో నిలబడే ఉన్నారని.. కొన్ని కారణాల వల్ల పోలింగ్ ఆలస్యం జరిగి రాత్రి 9 వరకు ఓట్లు వేసేవారు ఉంటారని తెలిపారు. కావాలంటే రేపు ఉదయం ఎగ్జిట్ పోల్స్ వంటివి రిలీజ్ చేసుకుంటే ఓ అర్థం ఉంటుంది కానీ.. అసలు పోలింగే పూర్తి కాకుండా ఈ పార్టీకి ఇన్ని వచ్చాయి ఆ పార్టీకి అన్ని వచ్చాయి అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్‌తో కూడా మాట్లాడానని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో కూడా BRS పార్టీకి తక్కువగా వచ్చాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని.. ఐదు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో నాలుగు తప్పు అని నిరూపించామని తెలిపారు. కచ్చితంగా తమ పార్టీకి 70 కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే ఆశిస్తున్నామని తెలిపారు.