Animal సినిమా గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Animal: అర్జున్ రెడ్డి (arjun reddy) తర్వాత యానిమల్ అనే క్రేజీ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga). అందులోనూ రణ్‌బీర్ కపూర్ (ranbir kapoor) హీరో..రష్మిక మందన (rashmika mandanna) హీరోయిన్గా నటించారు. బాబీ డియోల్ (bobby deol) విలన్ క్యారెక్టర్లో నటించారు. ఈ సినిమా టీజరే ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించింది. రేపే ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతోంది. తొలిరోజే రూ.70 కోట్ల వరకు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సినిమాకు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
భారీ రన్‌టైం ఉన్న సినిమాల్లో ఒకటి
యానిమల్ సినిమా రన్ టైం మరీ ఎక్కువగా ఉంది. 3 గంటల 35 నిమిషాలు (201 నిమిషాలు) నిడివి ఉన్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా వీర్ జారా (3 గంటల 17 నిమిషాలు), దిల్వాలే దుల్హనియా లేజాయేంగే (3 గంటల 9 నిమిషాలు), కల్ హో న హో (3 గంటల 8 నిమిషాలు) కంటే ఎక్కువ నిడివి కలిగి ఉంది.
గంటకు పదివేల టికెట్లు
ఈ సినిమాకు భారతదేశంలో క్రేజ్ ఎలా ఉందంటే.. ప్రతి గంటకు 10వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయట. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల రూ.3.5 కోట్లు రాబట్టింది. (animal)
ఆ క్లాసిక్ సినిమాకు అడల్ట్ వెర్షన్
బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన కభీ ఖుషి కభీ గమ్ సినిమాకు యానిమల్ సినిమా అడల్ట్ వెర్షన్‌లా ఉంటుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. సింగిల్ లైన్లో ఈ స్టోరీ గురించి చెప్పాలంటే.. తన కుటుంబం కోసం ఎంతకైనా తెగించే ఓ యువకుడి కథ.
అందుకే యానిమల్ అనే టైటిల్ పెట్టారు
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ ప్రవర్తన జంతువుల్లాగే ఉంటుంది కాబట్టి సినిమాకు యానిమల్ అనే టైటిల్ పెట్టినట్లు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. (animal)
బాబీ డియోల్ క్యారెక్టర్
ఈ సినిమాలో బాబీ డియోల్ తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసాడని ట్రైలర్‌ని బట్టి తెలిసిపోతోంది. ఈ సినిమాలో బాబీ మనుషులను తినే వ్యక్తి పాత్రలో నటించారు. అంతేకాదు ఇతను మూగ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.