Salaar: రేపే ట్రైల‌ర్.. రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయా డార్లింగ్?

Salaar Trailer: ప్ర‌శాంత్ నీల్ (prashanth neel), ప్ర‌భాస్ (prabhas) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సునామీ స‌లార్. రేపు రాత్రి 7:19 గంట‌ల స‌మ‌యంలో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌శాంత్ త‌న ఫోనులో ప్రభాస్‌కు ఏదో చూపిస్తున్న‌ట్లుగా ఉన్న స్టిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌శాంత్ రేపు రిలీజ్ అవ్వ‌బోయే ట్రైల‌ర్‌ను ప్ర‌భాస్‌కు చూపిస్తున్నాడ‌ని.. అది చూసిన ప్ర‌భాస్ రికార్డులు బ‌ద్ద‌లైపోతాయా డార్లింగ్ అని అడుగుతున్న‌ట్లున్నార‌ని ఫ్యాన్స్ స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు.