Justin Trudeau: భారత్ సీరియస్గా సహకరిస్తే మంచిది.. ట్రూడో వార్నింగ్
Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (hardeep singh nijjar) హత్య కేసులో భారత్ హస్తం ఉందని ఆరోపణలు చేసిన ట్రూడో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాకు పూర్తిగా సహకరించాలని అమెరికా కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నున్ను (gurpatwant singh pannun) చంపేందుకు భారత్ యత్నించిగా దానిని అమెరికా (america) ఆపిందన్న వార్త బయటికి వచ్చింది. దీనిపై భారత్ స్పందిస్తూ ఇది తమకు సర్ప్రైజింగ్గా ఉందని పేర్కొంది. దీనిపై ట్రూడో స్పందిస్తూ.. తాను మొదటి నుంచి చెప్తున్నది ఇదేనని.. ఇప్పటికైనా భారత్ హర్దీప్ సింగ్ నిజ్జర్, పన్నున్ హత్యలకు ప్లాన్ చేయడంపై తాము చేపడుతున్న విచారణకు సహకరించాలని అన్నారు.