Ustaad: ర్యాంప్ ఆడిద్దాం..!

చాలా కాలం త‌ర్వాత మంచు మ‌నోజ్ (manchu manoj) ఓ కొత్త గేమ్ షోతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ గేమ్ షోకు ఉస్తాద్ (ustaad) అనే టైటిల్ పెట్టారు. ఈ గేమ్ షో పోస్ట‌ర్‌ను రివీల్ చేస్తూ.. ఇంత‌కాలం త‌న నుంచి అప్డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ.. ఈ గేమ్ షోతో ర్యాంప్ ఆడిద్దాం అని ట్వీట్ చేసారు మ‌నోజ్. అహం బ్రహ్మాస్మి (aham brahmasmi) అనే ప్యాన్ ఇండియా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తార‌ని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూసారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాను ప్ర‌స్తుతానికి ఆపేసామ‌ని మనోజ్ తెలిపారు.