Hamas చెర నుంచి విడుదలైన చిన్నారి.. ఎందుకు వింతగా ప్రవర్తిస్తోంది?
Hamas: ఇటీవల ఇజ్రాయెల్ హమాజ్‌కు (israel gaza war) మధ్య కుదిరిన సంధితో హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇజ్రాయెల్ కొన్ని రోజుల పాటు గాజాపై ఎలాంటి యుద్ధ దాడులు చేయబోమని ప్రకటించింది. హమాస్ చెరలో ఉన్న బందీల్లో తొమ్మిదేళ్ల ఎమిలీ అనే చిన్నారి కూడా ఉంది.
మొన్న హమాస్ విడుదల చేసిన వారిలో ఎమిలీ కూడా ఉంది. అయితే ఎమిలీ ఇంటికి వచ్చాక వింతగా ప్రవర్తిస్తోందట. ఏం చెప్పాలనుకున్నా ఏం మాట్లాడాలనుకన్నా చెవిలో మాత్రమే మాట్లాడుతోందట. ఏదైనా పిలవాలనుకున్నా ఏమైనా కావాలన్నా కూడా చెవిలో మాత్రమే చెప్తోందని ఎమిలీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బహుశా హమాస్ చెరలో ఉన్నప్పుడు ఆ చిన్నారి భయంతో ఎవ్వరికీ వినపడకుండా తనకు తోడుగా ఉన్న తోటి బందీలతో ఇలాగే మాట్లాడుతుండేదని.. ఇప్పుడు తల్లిదండ్రుల వద్దకు చేరిన తర్వాత కూడా అలాగే మాట్లాడటం అలవాటై ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు చెప్తున్నారు. కొన్ని రోజుల్లో కోలుకుంటుందని పేర్కొన్నారు.