ఉద్యోగంలో స‌క్సెస్ అవ్వాలంటే.. ఈ టిప్స్ మీకోస‌మే!

Spiritual: ఎంత క‌ష్ట‌ప‌డినా కొంద‌రు ఉద్యోగంలో స‌క్సెస్ అవ్వ‌లేక‌పోతుంటారు. నోటిదాకా వ‌చ్చిన‌ ముద్ద చేజారిపోయిన‌ట్లు.. ప్ర‌మోష‌న్లు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి ఆగిపోతుంటాయి. కొన్ని సార్లు మ‌న క‌ష్టంతో పాటు మ‌న జాత‌కం కూడా కాస్త స‌హ‌క‌రించాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీకూ ఇలాగే అనిపిస్తుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

*ఉద‌యాన్నే లేచి స్నానం చేసి సంధ్యావ‌దనం చేసి గాయత్రి మంత్రాన్ని జ‌పించండి. గాయ‌త్రి మంత్రంతో పాటు ఓం పుష్నే న‌మః సూర్య కిర‌ణాలు శ‌రీరంపై ప‌డితే ఎంతో మంచిది.

*ఇల్లు కానీ కార్యాల‌యం కానీ ఉత్త‌ర దిక్కుగా ఉంటే ఎంతో మంచిది. అభివృద్ధి వైపు నడిచేలా చేస్తుంది.

*మీ ఇంట్లో ఆర్టిఫిషియ‌ల్ ఫౌంటెయిన్ కానీ అక్వేరియం కానీ ఉంటే అది ఉత్త‌ర దిక్కు వైపు ఉండేలా చూసుకోండి.

*ఉత్త‌ర దిక్కు వైపు న‌లుపు, నీలం రంగుల్లో ఉండే ఫోటోలు పెట్టుకున్నా మంచిదే.

*స‌మ‌స్య‌లు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వ‌స్తున్నాయంటే అన్ని గ్ర‌హాలు క‌క్ష గ‌ట్టిన‌ట్లు అర్థం. అందుకే ఇంట్లో వారితో మాట్లాడి ఓసారి న‌వ‌గ్ర‌హ హోమం చేయించుకుంటే మంచిది. ఇంట్లోనే చేయించుకోవడం ఉత్త‌మం. ఈ విష‌యంలో మీకు తెలిసిన జ్యోతిష్యులు ఉంటే సంప్ర‌దించి చూడండి.

*మీ ఇంటి కుల‌దైవం ఎవ‌రో తెలుసుకుని రోజూ ఆ దైవానికి సంబంధించిన మంత్రాలు ప‌ఠించి చూడండి.

*ఎంత ప్ర‌య‌త్నించినా ఉద్యోగం రాని వారు ప్ర‌తి శ‌నివారం శని దేవుని ముందు దీపం వెలిగించండి.

*శనివారం నాడు వీలైనన్ని సార్లు శ‌ని మంత్రాన్ని జ‌పిస్తూ ఉండండి. ఆయ‌న ప్ర‌భావం త‌గ్గుతుంది.