Nara Lokesh: జ‌గ‌న్ భ‌య‌ప‌డిందే ప‌వ‌న్ అన్న చేసి చూపించాడు

Nara Lokesh: సైకో జ‌గ‌న్ (ap cm jagan) తెలుగు దేశం పార్టీ (tdp) జ‌న‌సేన (janasena) క‌ల‌వ‌కూడ‌దు అని ఎంతో కోరుకున్నాడు కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) అన్న‌య్య అదే చేసి చూపించాడ‌ని అన్నారు నారా లోకేష్‌ . యువ‌గ‌ళం (yuvagalam) పాద‌యాత్ర‌లో భాగంగా ముమ్మిడివ‌రంలో ఆయ‌న ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 2024లో క‌చ్చితంగా వ‌చ్చేది తెలుగు దేశం పార్టీ జ‌న‌సేన ఉమ్మ‌డి ప్ర‌భుత్వ‌మేన‌ని.. ముమ్మిడివ‌రం ప్ర‌జ‌ల‌కే కాకుండా యావ‌త్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు హామీలు చెప్పి మోసం చేసిన జ‌గ‌న్‌కు త‌ప్ప‌కుండా బుద్ధి చెప్తాన‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ల్ల న‌ష్ట‌పోయిన ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు, పోలీసులను కూడా తానే ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు.