ప్రియుడి ఫోన్ చెక్ చేసిన యువ‌తికి ఊహించ‌ని షాక్

త‌న ప్రియుడి (boyfriend) ఫోన్‌లో ఇద్ద‌రూ క‌లిసి దిగిన ప్రైవేట్ ఫోటోల‌ను డిలీట్ చేయాల‌నుకున్న ఓ యువ‌తికి ఊహించని షాక్ ఎదురైంది. బెంగ‌ళూరుకు చెందిన 22 ఏళ్ల త‌న్వి.. త‌ను ప‌నిచేస్తున్న కంపెనీలోనే ఆదిత్య అనే యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డింది. ఐదు నెల‌లుగా వీరిద్ద‌రూ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు.

అయితే త‌న్వి.. మున్ముందు ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఆదిత్య ఫోన్‌లో ఉన్న ప్రైవేట్ ఫోటోల‌ను డిలీట్ చేయాల‌ని అనుకుంది. అలా ఆదిత్య ఫోన్‌ను చెక్ చేయ‌గా.. అందులో ఎంద‌రో అమ్మాయిలు, ఆంటీల‌కు సంబంధించిన న‌గ్న ఫోటోలు ఉండ‌టం కూడా కంగుతింది. ఆ ఫోటోల్లో కంపెనీలోని ఇత‌ర అమ్మాయిల న‌గ్న ఫోటోలు కూడా ఉన్నాయి.

దాంతో ఆదిత్య ఓ ఉమెనైజ‌ర్ అని తెలుసుకున్న త‌న్వి అత‌నికి బ్రేక‌ప్ చెప్పి వెంట‌నే ఆఫీస్‌లోని పై అధికారుల‌కు ఫిర్యాదు చేసింది. ఆదిత్య ఫోన్‌లో ఏకంగా 13000 న‌గ్న ఫోటోలు ఉన్నట్లు త‌న్వి గుర్తించింది. దాంతో ఆఫీస్ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఆదిత్య‌ను అరెస్ట్ చేసారు. పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.