KTR మామా.. నా చిన్న కోరికను తీరుస్తారా?
ఎన్నికల సమయంలో (telangana elections) యువతకు ఏం కావాలో.. మహిళలు, పేదలు, రైతులకు ఏం కావాలో అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు ఐటీ శాఖ మంత్రి KTR. వారికేనా మరి నాకేం లేదా అంటూ ఓ చిట్టి తల్లి KTRను ఓ కోరిక కోరింది. హలో KTR మామా.. హైదరాబాద్కు డిస్నీ ల్యాండ్ తీసుకురండి ప్లీజ్ అని ముద్దుగా అడుగుతున్న వీడియోను ఆ చిన్నారి తండ్రి ట్విటర్లో పోస్ట్ చేస్తూ KTRను ట్యాగ్ చేసారు. ఈ వీడియో చూసిన KTR స్పందిస్తూ.. ప్రామిస్ చెయ్యలేను కానీ ట్రై చేస్తాను బేటా అని ట్వీట్ చేసారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.