Interview: ఇంటర్వ్యూలో మహిళకు ఎదురైన ప్రశ్న.. పాపం నవ్వాలో ఏడవాలో తెలీట్లేదట
Interview: ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ముందే బేరీజు వేసుకుని అన్నింటికీ ప్రిపేర్ అయ్యి వెళ్తుంటారు. కానీ లక్ కలిసి రాకపోతే ఇదిగో ఈ అమ్మాయికి ఎదురైన సమస్యే మనకూ రావచ్చు. బీటా గోల్ష్ అనే మహిళ ఓ కంపెనీలో తనకు నచ్చిన పోస్ట్ ఖాళీగా ఉంటే అప్లై చేసుకుంది. ఆ తర్వాత అదే కంపెనీ నుంచి బీటాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. మొదటి రౌండ్ అయ్యాక ఓ పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో బీటాకు ఓ వింత ప్రశ్న ఎదురైందట. ఆ ప్రశ్న చూసి నవ్వాలో ఏడవాలో తనకు అర్థంకాలేదని సోషల్ మీడియాలో పేర్కొంది.
ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. మీ దగ్గర ఒక ఏనుగు ఉందనుకోండి. ఆ ఏనుగును మీరు అమ్మలేరు.. ఉచితంగా ఇచ్చేయలేరు. అలాంటప్పుడు ఆ ఏనుగుతో ఏం చేస్తారు? అని అడిగారట. దాంతో బీటాకు ఏం చేయాలో తెలీక ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వదిలేసిందట. ఒకవేళ తన లక్ బాగుండి కంపెనీ తనను ఎంపిక చేసుకుంటే వారినే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో అడుగుతానని అంటోంది. ఇంటర్వ్యూల్లో ఇలాంటి ప్రశ్నలు మున్ముందు ఇంకెన్ని ఎదురవుతాయో ఏంటో అని నెటిజన్లు ఆమె పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు.