Karthika Pournami: పొరపాటున కూడా ఈ పనులు చేయకండి సుమీ..!
Karthika Pournami: కార్తీక మాసంలో వచ్చే ఎంతో పవిత్రమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. పౌర్ణమి తిథి 26న మధ్యాహ్నం 3:53 గంటలకు మొదలై ఈరోజు మధ్యాహ్నం 02:45 వరకు ఉంటుంది. ఈ పర్వదినాన ఏం చేయాలో.. ముఖ్యంగా చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
*బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచి నదీ స్నానాలు ఆచరించాలి. మీ సమీపంలో నదులు లేకపోయినా చెరువు, సరస్సులు వంటివి ఉంటే అక్కడ స్నానాలు ఆచరించినా మంచిదే. అవి కూడా అందుబాటులో లేకపోయినా ఫర్వాలేదు. (karthika pournami)
*ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటివి దూరంగా ఉండాలి. మద్యం అస్సలు ముట్టకూడదు.
*విష్ణుమూర్తి, శివయ్య పాటలు, శ్లోకాలు వింటూ ఉండాలి.
*కుదిరితే శివాలయానికి వెళ్లి రండి. ఎంతో పుణ్యం. (karthika pournami)
*లేనివారిని భోజనం పెట్టినా.. లేదా ఏవైనా దానాలు చేసినా కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. ఈరోజు శివయ్య, విష్ణుమూర్తులు వారి రూపంలోనే మనకు దర్శనమిస్తుంటారట.
*ఇతరులు చేసిన వంటల కంటే మీకు మీరే స్వయంగా చేసుకుని తినండి.
*ఈరోజు ఇంట్లోవారితో కానీ బయటివారితో ఎలాంటి గొడవలు పెట్టుకోకండి. మౌనంగా ఉండేందుకు యత్నించండి. మీ ధ్యాస శివుడిపైనే ఉండాలి. (karthika pournami)
*మీకు మంత్రాలు, శ్లోకాలు రాకపోయినా ఫర్వాలేదు. ఈరోజంతా శివాయ నమః అని కానీ ఓం నమః శివాయ అని కానీ జపిస్తూ ఉన్నా ఎంతో పుణ్యం.