Elections: వ్యోమగాములు ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారు?
Elections: ఈ ఏడాది భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే గురువారం మన తెలంగాణలో (telangana elections) పోలింగ్ మొదలవుతుంది. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రానికి వస్తుంటారు. ఇంకొందరైతే ఎవరు వేస్తారు లే అనుకుని ఇంట్లోనే ఉండిపోతారు. మనం అంటే భూమి మీద ఉన్నాం కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోగలుగుతున్నాం. మరి అంతరిక్షంలో ఉన్న భారత్‌కు చెందిన వ్యోమగాములు (astronauts) తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారు?
ఇప్పటివరకు మన వ్యోమగాములకు ఇలాంటి సందర్భం రాలేదు కానీ అమెరికాకు చెందిన వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచే ఓటు వేసేవారట. 1997 నుంచి అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అమెరికా ప్రభుత్వం కల్పించింది. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఉన్న మిషన్ కంట్రోల్ ద్వారా అంతరిక్షంలోకి పోస్టల్ బ్యాలెట్లు పంపించి వ్యోమగాముల నుంచి ఓటు వేయించుకునేవారట. ఆ తర్వాత ఆ బ్యాలెట్లను మళ్లీ భూమిపైకి రప్పించుకుని ఆ ఫైల్స్ హార్డ్ కాపీలను సంబంధిత అధికారులకు పంపేవారు.
అయితే భారత్‌కు ఎప్పుడూ ఇలాంటి సందర్భం రాలేదు. ఒకవేళ వచ్చినా వారి ఓట్లను ఇంట్లో వారిని అడిగి ఎవరికి వేయాలనుకుంటున్నారో తెలుసుకుని వేసేవారు. ఇప్పుడు భారత వ్యోమగాములు ఎవ్వరూ కూడా అంతరిక్షంలో లేరు.