Khushi రిలీజ్ డేట్ ఫిక్స్!
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘ఖుషి’. అరుదైన ప్రేమ కథగా రూపొందుతున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సమంత అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈమధ్యనే మహిళా దినోత్సవం సందర్భంగా సమంతకి ఖుషీ సెట్స్‌లోకి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసిన ఫొటోలు పంచుకున్నారు శివ నిర్వాణ. సమంత రాకతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుండడంతో విడుదల తేదీని ప్రకటించేశారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. సమంత అనారోగ్యం కారణంగా మూడు నెలలపాటు రెస్ట్ తీసుకోవడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఒకానొక దశలో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 వ తారీకు విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నట్టు ప్రచారం కూడా జరిగింది.
విజయ్ దేవరకొండ సమంతాల తొలి కలయికలో రూపొందుతున్న ఖుషి ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. గత ఏడాది సామ్ అనారోగ్యం పాలు కాకపోయి ఉంటే ఎప్పుడో డిసెంబర్ లోనే వచ్చేసేది. ఇటీవలే బ్యాలన్స్ షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు శివ నిర్వాణ బ్రేకులు లేకుండా వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు.
ఏ కోణంలో చూసుకున్నా ఖుషి చాలా తెలివైన డేట్ ని పట్టేసింది. ఎందుకంటే ఆ రోజు చెప్పుకోదగ్గ టాలీవుడ్ సినిమాలేవీ లేవు. బాలీవుడ్ మూవీ ఆకాశమే నీ హద్దురా రీమేక్ ఒకటే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనివల్ల టాలీవుడ్ మీద పడే ప్రభావం సున్నా కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి రెండు వారాల ముందు కూడా నోటెడ్ రిలీజులు ప్లాన్ చేయలేదు. ఆగస్ట్ లోనే భోళా శంకర్, జైలర్, యానిమల్ లాంటి పెద్ద మూవీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఖుషికి ఫ్రీ గ్రౌండ్ దొరికేస్తుంది.
పూరీ దర్శకత్వంలో రూపొందిన లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి పైనే ఆశలు పెట్టుకున్నాడు. సున్నితమైన ప్రేమకథలు చెప్పడంలో మంచి నేర్పరి అయిన శివ నిర్వాణ ఈ సినిమాని కూడా అదే తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి మాలీవుడ్ సెన్సేషన్ హీశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇది అతనికి టాలీవుడ్ డెబ్యూ మూవీ. ఖుషి మ్యూజిక్ గురించి ఫీడ్ బ్యాక్ విన్నాకే నాని 30కి ఛాన్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఖుషి తో పాటు గౌతమ్ తిన్ననూరి ఇంకా పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తున్నారు. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల విజయం సమంత కెరీర్‌కి చాలా అవసరం.