కొత్తగా పెళ్లైనవారు పాటించాల్సిన వాస్తు నియమాలు
Vastu: కొత్తగా పెళ్లైన వారు ఇంట్లోకి అడుగుపెట్టాక కొన్ని వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుందట. కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్న దంపతులు వాస్తు ప్రకారం కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందట. ఇంతకీ ఆ వాస్తు నియమాలేంటో తెలుసుకుందాం.
*కొత్త దంపతులు నిద్రించాల్సిన పడక గది నైరుతి వైపు ఉండాలట. దీని ద్వారా వారి దాంపత్య జీవితం సజావుగా ఉంటుంది.
*కొత్తగా పెళ్లైన వారికి తమ వివాహ ఫోటోలను తమ గదిలో పెట్టుకోవాలని ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఫోటోలను పడక గదిలోని తూర్పు దిక్కున మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఇద్దరి మధ్య అర్థంచేసుకునే గుణం పెరుగుతుందట.
*పడక గదిలోని మంచాలు దక్షిణం వైపు ఉండాలి. పడక గదిలో ఏ వస్తువులు కూడా నలుపు, బ్రౌన్, గ్రే, క్రీం కలర్లలో ఉండకూడదు. పసుపు, బ్లూ, పింక్, ఆరెంజ్ రంగులనే ఎంచుకోవాలి. మీ పడక గదిలో అద్దం ఉంటే అది మంచం వైపు ఉండకూడదు.
*పడక గది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. ఆఫీస్‌కి సంబంధించిన వస్తువులను బెడ్రూంలో ఉంచకపోవడమే మంచిది.
*గదిలో చెక్కతో తయారుచేసిన ఫర్నీచర్‌ని మాత్రమే పెట్టుకోవాలి. ప్లాస్టిక్‌తో తయారుచేసినవి వద్దు.