మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ.. వీడియో వైరల్
సినీ నటుడు మంచు మనోజ్ ఇంట్లో ఆయన అన్న మంచు విష్ణు గొడవచేసారు. “రోజూ ఇదేనండి గొడవ, ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లని, బంధువులను కొడుతుంటాడు” అంటూ మనోజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. వీడియోలో విష్ణు.. మనోజ్‌ను కొట్టడానికి వస్తున్నట్లు.. మధ్యలో ఎవరో ఆపుతుంటే “వాడేదో అంటున్నాడుగా” విష్ణు అంటున్నట్లు కనిపిస్తోంది. అయితే నిజంగానే గొడవ జరిగిందా లేదా ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఇటీవల మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి జరగడం మంచు విష్ణుకు ఇష్టం లేదని అందుకే పెళ్లికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్లిపోయాడని పుకార్లు వచ్చాయి.