Israel Gaza War: నేడు బందీల‌ను రిలీజ్ చేయ‌నున్న హ‌మాస్

Israel Gaza War: దాదాపు రెండు నెల‌లుగా ఇజ్రాయెల్.. గాజాలోని హ‌మాస్‌కు (hamas) మ‌ధ్య జరుగుతున్న యుద్ధానికి ఈరోజు కాస్త బ్రేక్ ప‌డింది. ఒక నాలుగు రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌కు (ceasefire) ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఇజ్రాయెల్ హ‌మాస్‌కు మ‌ధ్య కుదిరిన డీల్‌లో భాగంగా ఈరోజు 13 మంది బందీల‌ను హ‌మాస్ విడిచిపెట్ట‌నుంది.

భార‌త కాల మానం ప్ర‌కారం కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం ఈరోజు ఉద‌యం 10:30కు మొద‌లుకానుంది. రాత్రి 7:30 గంట‌ల స‌మ‌యంలో హ‌మాస్ 13 మంది బందీల‌ను విడిచిపెడుతుంది. ఆ 13 మంది బందీలలో మ‌హిళ‌లు వారి పిల్ల‌లు ఉన్నారు. ఈ నాలుగు రోజుల పాటు ఇజ్రాయెల్ గాజాపై ఎలాంటి కాల్పులు, దాడుల‌కు పాల్ప‌డ‌దు కాబ‌ట్టి దాదాపు 50 మందిని రిలీజ్ చేయ‌నున్నారు. ఇజ్రాయెల్ జైల్లో బందీలుగా ఉన్న పాలెస్తీనా సైనికులు ఈరోజు రిలీజ్ అవుతారు. ఖ‌తార్, అమెరికా క‌లిసి ఇజ్రాయెల్‌కు న‌చ్చ‌జెప్ప‌డంతో ఈ డీల్ కుదిరింది.