Prakash Raj: రూ.100 కోట్ల స్కాం.. ప్ర‌కాశ్ రాజ్‌కు స‌మ‌న్లు

Prakash Raj: రూ.100 కోట్ల పాన్జీ స్కాంలో భాగంగా న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌కు స‌మ‌న్లు అందాయి. ప్ర‌ణ‌వ్ జువెల‌ర్స్‌కు (pranav jewellers) ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ కంపెనీ ఓన‌ర్ రూ.100 కోట్ల పాన్జీ స్కాంకు (ponzi scam) పాల్ప‌డ్డాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ కంపెనీకి ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌కు ఏమ‌న్నా ముట్టాయా అనే అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

కేర‌ళ‌లోని త‌రుచ్చికి చెందిన ఈ ప్ర‌ణ‌వ్ జువెల‌ర్స్ సంస్థకు త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో కూడా బ్రాంచీలు ఉన్నాయి. పెట్టుబ‌డిదారుల నుంచి రూ.100 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి మోసానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో ఈడీ ఈ కేసును విచారిస్తోంది.