ఈ పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకుంటే అంతే సంగతి..!
వాస్తు శాస్త్రం (vastu) ప్రకారం కొన్ని రకాల పెయింటింగ్స్‌ని (paintings) ఇంట్లో పెట్టుకోకూడదట. అవి ఇంట్లో ఉంటే నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయట. అసలు ఏ రకమైన పెయింటింగ్స్ ఇంటి గోడలకు పెట్టుకోకూడదో తెలుసుకుందాం.
నీటి వృధా
ఇంట్లో నీరు వృధాగా పోతుంటే డబ్బు కూడా మంచి నీళ్లలా ఖర్చు అయిపోతుంది అంటుంటారు. అది నిజమే. అందుకే నీళ్లు వృధా చేయకూడదు. అంతేకాదు.. నీళ్లు కారుతున్నట్లుగా ఉన్న పెయింటింగ్స్ కూడా ఇంట్లో పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వాస్తు శాస్త్రం చెప్తోంది.
క్రూర మృగాలు
కుక్కలు, పిల్లలు ఫోటోలు, పెయింటింగ్స్ చూడటానికి చాలా బాగుంటాయి. వీటి వరకు ఫర్వాలేదు కానీ వైల్డ్ జంతువులు అంటే క్రూర మృగాలు ఉన్న పెయింటింగ్స్ మాత్రం ఇంట్లో ఉంచకపోవడమే మంచిది. అంటే సింహం, పులి, చిరుత, నక్కలు, గొరిల్లా, మొసళ్లు.. ఇలాంటి జంతువుల పెయింటింగ్స్ మాత్రం వద్దు. వీటి కంటే తెల్ల గుర్రాల పెయింటింగ్స్ కానీ ఫోటోలు కానీ పెట్టుకుంటే ఎంతో మంచిది. (paintings)
ఏడుస్తున్నట్లుగా ఉన్నవి..
కొన్ని రకాల పెయింటింగ్స్ చూస్తే మనకే దుఖం బాధ కలుగుతాయి. అలాంటివి ఇంట్లో పెట్టుకోకండి. అంటే ఓ ఆడది ఏడుస్తున్నట్లు లేదా బాధగా చూస్తున్నట్లు ఉన్న పెయింటింగ్స్ చూడటానికి అందంగా ఉంటాయి కానీ వాటిని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
తాజ్ మహల్
ప్రేమకు చిహ్నం అయిన తాజ్ మహల్ ఎంతో అందంగా ఉంటుంది. కానీ షాజహాన్ భార్య ముంతాజ్ బేగం సమాధిపై తాజ్‌మహల్ కట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాజ్ మహల్ పెయింటింగ్ ఇంట్లో ఉంది అంటే ఒకరి సమాధిని ఫోటో తీసుకుని ఇంట్లో పెట్టుకున్నట్లే అని చెప్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.