Telangana Elections: కీల‌క వీరులు..!

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌ల‌కు ఇంకో తొమ్మిది రోజులే ఉంది. బ‌రిలోకి దిగ‌నున్న పార్టీలు ప్ర‌చార జోరు పెంచాయి. 119 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎంద‌రో పోటీ పడుతున్నప్ప‌టికీ.. క‌ళ్లన్నీ ఈ న‌లుగురు అభ్య‌ర్ధుల‌పైనే ఉన్నాయి. వారెవ‌రో తెలుసుకుందాం.

KCR

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి KCR.. హ్యాట్రిక్ విజ‌యం కొడ‌తామ‌న్న ధీమాతో ఉన్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన గ‌జ్వేల్‌లో (gajwel) మాత్ర‌మే కాకుండా కామారెడ్డి (kamareddy) నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ కూడా రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ‌ని ఆయ‌న ఈసారి ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారా అని చాలా మంది ఆలోచ‌న‌ల ప‌డ్డారు. కొంద‌రేమో ఓట‌మి భ‌యంతోనే రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్నారు అంటుంటే.. KCR మాత్రం త‌న పార్టీ నిర్ణ‌యించింది కాబ‌ట్టి పోటీ చేస్తున్నా అన్నారు.

రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి (revanth reddy) కూడా ఈసారి రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయ‌న ముందున్న ధ్యేయం ఒక్క‌టే. ఎలాగైనా BRS పార్టీని ఓడించాలి. అందుకే ఆయ‌న కొడంగ‌ళ్ నుంచి మాత్ర‌మే కాకుండా కామారెడ్డి నుంచి కూడా బ‌రిలో దిగ‌నున్నారు. రేవంత్ ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అడ‌గాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. అందుకే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో త‌న కార్య‌క‌ర్త‌లు, స‌పోర్ట‌ర్ల చేత సీఎం సీఎం అని అరిపించుకుంటున్నారు.  (telangana elections)

బండి సంజ‌య్ కుమార్

BJP నేత బండి సంజ‌య్ కుమార్‌కు (bandi sanjay kumar) ఈ ఎన్నిక ఎంతో కీల‌కం. ఆయ‌న క‌రీంన‌గ‌ర్ నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి పోగొట్టుకున్న సంజ‌య్‌కు సీఎం ప‌ద‌విపై ఆశ ఉన్నందునే ఆయ‌న్ను ఆ ప‌దవి నుంచి తొల‌గించి కిష‌న్ రెడ్డిని నియ‌మించార‌ని టాక్. BJP నుంచి తెలంగాణ‌లో స్టార్ క్యాంపెయిన‌ర్లు ఎవరైనా ఉన్నారంటే అది బండి సంజ‌య్, ఈటెల రాజేంద‌ర్ మాత్ర‌మే. ఈసారి ఎలాగైనా గెలిచి త‌న స‌త్తాను నిరూపించుకోవాల‌నుకుంటున్నారు.

అజ‌హ‌రుద్దీన్

మాజీ క్రికెట‌ర్, కాంగ్రెస్ నేత అజ‌హ‌రుద్దిన్  (azharuddin) తొలిసారి తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ హై క‌మాండ్ ఆయ‌న‌కు జూబ్లీ హిల్స్ సీటు కేటాయించింది. కానీ అజ‌హ‌రుద్దీన్ ఎక్క‌డా కూడా ప్ర‌చారంలో పాల్గొన‌డం కానీ ప్రెస్ మీట్లు పెట్ట‌డం కానీ చేయ‌డంలేదు. తొలిసారి తెలంగాణ‌లో పోటీ చేస్తున్నారు కాబ‌ట్టి క‌చ్చితంగా గెల‌వాల‌నే అనుకుంటారు. కానీ అజహ‌రుద్దీన్‌కు అస‌లు పోటీ చేయాల‌న్న ఆసక్తి కూడా లేద‌ని తెలుస్తోంది.