Rahul Gandhi: టీమిండియా ఓటమికి కారణం మోదీనే…!
Rahul Gandhi: వరల్డ్ కప్ మ్యాచ్‌లో (world cup) టీమిండియా గెలిచేదే కానీ ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) రూపంలో బ్యాడ్ లక్ రావడం వల్ల ఓడిపోయిందని అన్నారు రాహుల్ గాంధీ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు మోదీ కూడా వెళ్లారు. ఆయన అడుగుపెట్టడం వల్లే టీమిండియా ఓడిపోయిందని రాహుల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై BJP మండిపడింది. గతంలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ కూడా ఇలాగే మాట్లాడి డిపాజిట్లు కూడా గెలవలేకపోయారని ఆమె ఓటమి నుంచి రాహుల్ ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని క్లాస్ పీకింది. క్రీడల ద్వారా రాహుల్ పార్టీని గెలిపించాలనుకుంటే ఇక ఆటకు ఈ దేశంలో ఎలాంటి విలువ ఉంటుందని BJP ప్రశ్నించింది.