Sajjala: చంద్రబాబు బెయిల్పై సజ్జల రియాక్షన్
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ విప్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబుకు కేవలం బెయిల్ మాత్రమే వచ్చిందని కేసు ఇంకా విచారణలోనే ఉందని తెలిపారు. ఆయన ఈ సమయంలో ప్రజల మధ్యలో తిరిగితే మంచిదే అని ప్రజలు అడిగే ప్రశ్నలకు ఆయన కచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ నుంచి రెగ్యులర్ బెయిల్ చేసినంత మాత్రాన ఆయన నిర్దోషి అని అర్థంకాదని.. కేసు కొట్టివేసినట్లు ఆయనను కోర్టు నిర్దోషిని అని ప్రకటించినట్లు తెలుగు దేశం పార్టీ (TDP) నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని వెల్లడించారు.