Chandrababu Naidu: బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు
Chandrababu naidu: TDP అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో (skill development case) ఇప్పటివరకు మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబుకు.. ఏపీ హైకోర్టు (ap high court) రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నెల 24వ తేదీతో చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సమయం పూర్తి అయిపోతుంది. ఈ సమయంలోనే ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి ఇక 24న ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ నెల 28 వరకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్పై పెట్టిన షరతులు వర్తిస్తాయని వాటిని చంద్రబాబు ఫాలో అవ్వాల్సిందేనని ఆయన తరఫు లాయర్లు చెప్తున్నారు.