Dhanush కొడుకు యాత్రకు జరిమానా వేసిన పోలీసులు
Dhanush: తమిళ నటుడు ధనుష్ పెద్ద కుమారుడు యాత్రకు (yatra) తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. చెన్నైలోని పోయోస్ గార్డెన్ ప్రాంతం సమీపంలో యాత్ర తన సూపర్బైక్పై వేగంగా వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసారని అతనికి పోలీసులు రూ.1000 జరిమానా విధించారు. ఆ సమయంలో యాత్రతో పాటు బైక్ నేర్పించేందుకు వచ్చిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు. బైక్ నేర్చుకుంటున్న సమయంలో యాత్ర హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఐశ్వర్య ధనుష్ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు యాత్ర రెండో కుమారుడి పేరు లింగా. ఈ ఘటన గురించి ఇంకా ధనుష్ కానీ ఐశ్వర్య కానీ స్పందించలేదు.