కిచెన్‌లో ఈ సామాన్లు పెట్టుకుంటే మంచిదా?
Vastu: చైనీస్ వాస్తు శాస్త్రం అయిన ఫెంగ్ షుయ్‌ని (feng shui) మన భారతదేశంలో కూడా చాలా మంది నమ్ముతారు. ఫెంగ్ షుయ్ ప్రకారం కిచెన్‌లో ఈ వస్తువులను పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందట. అవి ఏ వస్తువులో తెలుసుకుందాం.
క్రిస్టల్ బాల్స్ (crystal balls)
ఎక్వేరియం షాపులలో ఎగ్జిబిషన్‌లలో క్రిస్టల్ బాల్స్ చాలా పాపులర్. వీటిని ఒక బౌల్‌లో వేసి కిచెన్‌లో పెట్టుకుంటే ఎంతో మంచిదట.
మనీ ప్లాంట్ (money plant)
మనీ ప్లాంట్ కుండీని కానీ దానిని ఉంచిన గాజు సీసాను కానీ మీ కిచెన్‌లోని వాష్ బేసిన్ పక్కన పెడితే ఎంతో మంచిదట. అదృష్టంతో పాటు ఆర్థికంగానూ కలిసొస్తుందని ఫెంగ్ షుయ్ చెప్తోంది.
చేప ఫోటోలు (fish photos)
మీ కిచెన్ గోడలకు చేపల పోస్టర్లు, ఫోటోలు పెడితే పాజిటివిటీ ఉంటుందట.
ఆకుపచ్చ లేదా పసుపు రంగు కర్టెన్లు (curtains)
మీ వంటగదికి కిటికీలు కాస్త పెద్దగా ఉన్నట్లైతే వాటిని ఆకుపచ్చ, పసుపు రంగు కర్టెన్లతో డెకరేట్ చేయండి. ఒకవేళ కిటికీలు లేకపోతే ఈ రంగులలో కిటికీ ఫోటోలను కూడా అంటించవచ్చు. డైనింగ్ టేబుల్‌పై కూడా ఈ రంగులలో ఉండే ప్లేట్లు పెట్టుకోవచ్చు.