Kamareddi: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు.. కత్తితో పొడిచిన కాంగ్రెస్ గ్రామాధ్యక్ష్యుడు

Kamareddi: కామారెడ్డి – ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గండిపేట్ గ్రామానికి చెందిన జావిద్, అహ్మద్, రజాక్ అనే ముగ్గురు యువకులు గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్య‌తిరేక పోస్ట్‌లు పెడుతుండ‌టంతో కాంగ్రెస్ గ్రామాధ్యక్ష్యుడు బీందాస్ గ్రూప్ నుండి వారిని తొలగించాడు. గ్రూప్ నుండి ఎందుకు తొలగించావని వారు బీందాస్‌ని ప్ర‌శ్నించ‌గా.. కోపంతో ముగ్గురిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. వారిలో అహ్మద్ పరిస్థితి విషమంగా ఉంది.