Yuvraj Singh: ఇండియాను ఓడించాలంటే ఆస్ట్రేలియా ఎంతో కృషి చేయాలి

Yuvraj Singh: ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ (world cup) చివ‌రి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఇండియాతో ఆస్ట్రేలియా (ind vs aus) పోటీ ప‌డ‌నుంది. గ‌త వ‌రల్డ్ క‌ప్‌లో కూడా ఇండియా ఆస్ట్రేలియానే (australia) త‌ల‌ప‌డ్డాయి. కానీ ప్ర‌పంచ క‌ప్ ఆస్ట్రేలియా సొంత‌మైంది. కానీ ఈసారి ఎలాగైనా క‌ప్ కొట్టాల‌ని మ‌నోళ్లు ఎంతో కృషి చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా యువ‌రాజ్ సింగ్ త‌న విలువైన స‌ల‌హాల‌ను ఇవ్వాల‌నుకున్నారు. ఇండియా ఇప్ప‌టివ‌ర‌కు టాప్ పెర్ఫామ‌ర్‌గా నిలిచింది కాబ‌ట్టి ఫైనల్ మ్యాచ్‌లో ఇండియాను ఓడించాలంటే ఆస్ట్రేలియా ఎంతో కృషి చేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. అలాగ‌ని ఆస్ట్రేలియాను త‌క్కువ అంచనా అస్స‌లు వేయ‌కూడ‌ద‌ని.. టీమిండియా పొర‌పాట్లు చేస్తే త‌ప్ప క‌ప్ చేజార‌ద‌ని తెలిపారు. ఆస్ట్రేలియా టీంకు ఒత్తిడిని ఎలా అధిగ‌మించాలో బాగా తెలుస‌ని టీమిండియా చాక‌చ‌క్యంగా ఆడేస్తే క‌ప్ మ‌న‌దే అని పేర్కొన్నారు.